Thamma Movie | బాలీవుడ్లో వరుసగా ‘స్త్రీ’, ‘భేదియా’, ‘ముంజ్యా’ లాంటి హారర్ కామెడీ చిత్రాలను తెరకెక్కించిన టాప్ ప్రోడక్షన్ హౌస్ మాడ్డాక్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన తాజా చిత్రం ‘థామా’ (Thama). ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసింది. తాజాగా ఈ సూపర్ హిట్ సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ సినిమా ప్రైమ్ వీడియో రెంటల్ (Rental) విభాగంలో అందుబాటులో ఉంది. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించిన ఈ హారర్ యూనివర్స్ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మరియు ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రక్తం తాగే బేతాళురాలిగా, తారిక (తడకా) పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు. ఆయుష్మాన్ ఖురానా రిపోర్టర్ అలోక్ పాత్రలో నటించారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన విలన్ యక్షసాన్ పాత్రలో కనిపించారు.