సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 10న బైక్‌పై నుండి కింద పడి తీవ్ర గాయాలతో అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. తేజ్ ఆసుపత్రిలో చేరి 20 రోజులు అయింది. ఇప్పటికీ ఆయన ఆరోగ్యంపై అభిమానులలో ఆందోళన ఉంది. తేజ్ క్రమక్రమంగా కోలుకుంటున్నాడని అందరు భావిస్తున్న క్రమంలో ఇటీవల రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్..తన మేనల్లుడు ఇంకా కోమాలోనే ఉన్నాడని అన్నారు.
పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు అందరినీ గందరగోళానికి దారి తీశాయి. ఇక తాజాగా రిపబ్లిక్ ప్రమోష్స్లో భాగంగా దేవాకట్టా చేసిన కామెంట్లు అందరికీ ఆశ్చర్యపరిచాయి. సాయి ధరమ్ తేజ్ వేగంగా కోలుకుంటున్నాడని దేవా కట్టా చెప్పుకొచ్చాడు. పైగా రిపబ్లిక్ ఈవెంట్‌ను లైవ్‌లో చూశాడని కూడా తెలిపాడు. తాజాగా నాగబాబు సోషల్ మీడియాలో.. అతను త్వరగా కోలుకుంటున్నాడు.. తొందర్లోనే మన ముందుకు వస్తాడు అని క్లారిటీగా చెప్పాడు.
సాయి తేజ్ ఆరోగ్యంపై అభిమానులలో అనేక సందేహాలు నెలకొని ఉండగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఓ అప్డేట్ ఇచ్చాడు. అందరి ప్రార్ధనలు ఫలిస్తున్నాయి. నా నన్బ(ఫ్రెండ్) సాయి తేజ్ ఇంకా నెమ్మదిగా కోలుకుంటున్నాడు. అప్డేట్ ఇచ్చినందుకు సతీష్ బొట్టా కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి కొద్ది రోజుల్లోనే నా స్నేహితుడిని కలుస్తున్నందుకు ఎగ్జైటింగ్ గా ఉన్నానని” థమన్ కాస్త రిలీఫ్ ఇచ్చే అప్డేట్ ఇచ్చాడు.
All your prayers are working ❤️
— thaman S (@MusicThaman) September 30, 2021
My nanban @IamSaiDharamTej is recovering ❤️🩹 So well thanks @bkrsatish for the update . I am so excited to meet mY dear nanban in couple of days ⭐️#GetWellSoonSDT love u Nanba😍