Thalapathy Vijay | కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రీసెంట్గా ‘తమిళ వెట్రి కళగం’ (Tamizha Vetri Kazhagam) అంటూ పార్టీ పేరు కూడా అనౌన్స్ చేశాడు. అయితే ఈ పార్టీ 2024 ఎన్నికలలో పోటీ చేయబోవడం లేదని అలాగే ఏ పార్టీకి మద్దతు ఇవ్వట్లేదని విజయ్ తెలిపాడు. జనరల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇక తన చివరి సినిమా కూడా దళపతి 69 అని చెప్పాడు. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెడుతున్నట్లు చెప్పి ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ ఇచ్చాడు.
అయితే అలా అనౌన్స్ చేశాడో లేదో విజయ్ తర్వాత ఆ ప్లేస్‌ను ఎవరు భర్తీ చేస్తారంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు విజయ్ సినిమాలు మానేయడం తమిళ సినిమా బిజినెస్‌కు బాగా దెబ్బపడుతుందని.. ఆయన ఫ్లాప్ సినిమాలు సైతం ఇక్కడ మంచి బిజినెస్‌ను చేస్తాయని మాట్లాడుకుంటున్నారు.
ఇదిలావుండగా విజయ్ చివరి సినిమా దళపతి 69పై అందరిలోనూ క్యూరియాసిటీ ఏర్పడింది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఆడియెన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకుంటే విజయ్ లాస్ట్ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుంది మన తెలుగు నిర్మాత డి.వి.వి దానయ్య. ఈ సినిమాను పొలిటికిల్ నేపథ్యంలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడట విజయ్. ఓ వైపు ఈ సినిమాకు వెట్రిమారన్ దర్శకత్వం వహించబోతున్నాడనే టాక్ కూడా బాగా వినిపిస్తుంది.
అయితే ఈ సినిమా కోసం విజయ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమా కోసం విజయ్ దాదాపు రూ.200 కోట్లు తీసుకోబోతున్నాడట. ఈ వార్తలో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ… ఒకవేళ అంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటే మాత్రం ఇండియన్ సినిమా చరిత్రలో తొలిసారి రూ.200 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా విజయ్ నిలుస్తాడు. ప్రస్తుతం విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘గోట్’ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తి కాగానే.. దానయ్య సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా దీనిపై మరిన్ని వివరాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.