విజయ్ మాస్టర్ సినిమాకు ఊహించని షాక్
విజయ్ మాస్టర్ | ఈ సినిమాకు కేవలం 17.1 రేటింగ్ మాత్రమే వచ్చింది. ఇవి విజయ్ గత సినిమాల కంటే చాలా తక్కువ. బిగిల్ 21.9, సర్కార్ 21.7 టీఆర్పీ రేటింగ్‌తో చాలా ముందున్నాయి.

తమిళ ఇండస్ట్రీలో రజనీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్. కొన్నేళ్లుగా విజయ్ సినిమాలు చేస్తున్న బిజినెస్.. ఆయన వసూలు చేస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే తమిళనాట నెంబర్ వన్ హీరో ఈయనే అని అర్థమైపోతుంది. విజయ్ సినిమాలకు థియేటర్ బిజినెస్ ఏ రేంజ్లో జరుగుతుందో శాటిలైట్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతుంటుంది. దీనికి తగ్గట్లుగానే విజయ్ సినిమాలకు టీఆర్పీ రేటింగ్స్ కూడా అదే స్థాయిలో వస్తాయి. విజయ్ గత సినిమాలు బిగిల్, సర్కార్ టీఆర్పీ రేటింగ్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాయి. ఇప్పుడు మాస్టర్ కూడా వాటి రికార్డులను తిరగరాస్తుందని గట్టిగా నమ్మారు అభిమానులు. కానీ ఆ సినిమా టీఆర్పీ మాత్రం అభిమానులను నిరాశ పరిచింది.
సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించింది మాస్టర్ సినిమా. కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతో రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ సినిమా. లోకేష్ కనకరాజు ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఇదిలా ఉంటే మాస్టర్ సినిమాను ప్రముఖ ఛానల్ ప్రసారం చేసింది. మంచి అకేషన్ చూసుకొని ఈ సినిమాను టెలికాస్ట్ చేశారు. అయినా కూడా రేటింగ్ అంతగా రాలేదు. ఈ సినిమాకు కేవలం 17.1 రేటింగ్ మాత్రమే వచ్చింది. ఇవి విజయ్ గత సినిమాల కంటే చాలా తక్కువ. విజయ్ గత సినిమాలు బిగిల్ 21.9, సర్కార్ 21.7 టీఆర్పీ రేటింగ్‌తో చాలా ముందున్నాయి. నాలుగేళ్ల కిందట విడుదలైన తెరీ సినిమాకు కూడా 18 రేటింగ్ వచ్చింది.
అయితే మాస్టర్ సినిమాకు ఇంత తక్కువ టీఆర్పీ రేటింగ్ రావడం వెనుక కూడా బలమైన కారణాలు ఉన్నాయి. ఈ సినిమా విడుదలైన రెండు వారాలకే అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో వచ్చేసింది. విజయ్ అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా అక్కడే సినిమాను చూసేశారు. దీంతో ఇప్పుడు టీవీలో వేసిన కూడా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. విజయ్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో కొత్త సినిమాకు కమిట్ అయ్యాడు. త్వరలోనే జార్జియాలో ఈ సినిమా షెడ్యూల్ మొదలు కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
జబర్దస్త్‌లో ఇక రోజా కనిపించదా.. అభిమానుల్లో మొదలైన అనుమానాలు
లంగా డాన్సులేసే స్టార్లకు 50 కోట్లా.. PVP ట్వీట్ వైరల్
ఈషా రెబ్బా హాట్ పోజు.. శరీరాన్ని ఇంద్ర ధనస్సులా తిప్పేసిన తెలుగమ్మాయి
సోనూసూద్‌కు కరోనా నెగిటివ్..ఆనందంలో ఫ్యాన్స్..!
అల్లు అర్జున్ చేసిన పనికి షాకైన భార్య
హీరోయిన్ సరదా తీర్చేశాడు..షాకిచ్చాడు
కేటీఆర్‌కు కరోనా.. త్వరగా కోలుకోవాలి అంటూ చిరు ట్వీట్
దృశ్యం2 సినిమాపై పుకార్లు.. ఖండించిన సురేష్ బాబు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Angomcha Bimol | ఆ ఎంపీని సస్పెండ్ చేయండి.. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు
Eye Sight | భారతీయుల్లో పెరుగుతున్న దృష్టి లోపం సమస్య.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు..
Dubai ETCA | దుబాయ్‌లో ఘనంగా ETCA 16వ బతుకమ్మ సంబరాలు.. 6 వేల మందికిపైగా తెలంగాణ ప్రవాసుల భాగస్వామ్యం
కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

