జబర్దస్త్లో ఇక రోజా కనిపించదా.. అభిమానుల్లో మొదలైన అనుమానాలు

చూస్తుంటే ఇప్పుడు ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే గత కొన్ని వారాలుగా జబర్దస్త్ జడ్జి రోజా రెగ్యులర్ గా అక్కడ కనిపించడం లేదు. రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా కూడా టెలివిజన్ కోసం కొంత సమయం కేటాయించేది రోజా. డేట్స్ విషయంలో ఎప్పుడూ కన్ఫ్యూజన్ కు చోటు లేకుండా చూసుకునేది. అయితే ఇప్పుడు మాత్రం ఈమె కామెడీ షో లో కనిపించడం లేదు. ఈ మధ్య అనారోగ్యం పాలైన రోజా కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండి డిశ్చార్జ్ అయ్యింది. రెండు మేజర్ సర్జరీలు కూడా జరిగాయి. ఈ విషయం అభిమానులకు కాస్త ఆలస్యంగా తెలిసింది. ఇదిలా ఉంటే కేవలం అనారోగ్యం కారణంగానే జబర్దస్త్ కామెడీ షో నుంచి తప్పకుందా లేదంటే రాజకీయంగా బిజీ కావడంతో ఈ షోకు గుడ్ బై చెప్పిందా అనేది అర్థం కావడం లేదు.
దాదాపు ఐదారు వారాల నుంచి జబర్దస్త్ లో రోజా స్థానంలో సీనియర్ హీరోయిన్ ఇంద్రజ కనిపిస్తుంది. అయితే ఎక్స్ ట్రా జబర్దస్త్ లో మాత్రం మనోతో పాటు రోజా అలాగే ఉంది. దాంతో కేవలం ఒక ఎపిసోడ్ మాత్రమే వదిలేసి మరో ఎపిసోడ్ లో ఈమె కంటిన్యూ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎక్స్ ట్రా జబర్దస్త్ నుంచి కూడా రోజా తప్పుకుంది. అక్కడ కూడా ఇంద్రజ కనిపించడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. జబర్దస్త్ కామెడీ షోలో రోజా కనిపించదా అని ప్రశ్నిస్తున్నారు. ఇది గ్యాపా లేదంటే పూర్తిగా గుడ్ బై చెప్పినట్లా అనేది రోజా క్లారిటీ ఇవ్వాలి.
2013లో జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఈమె కంటిన్యూ అవుతుంది. మధ్యలో అప్పుడప్పుడు చిన్న చిన్న బ్రేక్ తీసుకున్నా గుడ్ బై మాత్రం చెప్పలేదు. అయితే రెండేళ్ళ కింద నాగబాబు ఈ షో నుంచి బయటకు వెళ్లిపోవడంతో రోజా కూడా వెళ్ళిపోతుందని రూమర్స్ మొదలయ్యాయి. పైగా రాజకీయాల్లోనూ బిజీ కావడంతో ఈమె ఈ షో వదిలేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు రోజా రెండు ఎపిసోడ్లలో కనిపించకపోవడంతో ఇది నిజమే అని అందరూ కన్ఫమ్ చేసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..
కొవిడ్ సెకండ్ వేవ్ భిన్నం.. వచ్చే 4 వారాలు ఎందుకు కీలకమంటే..?
vaccine registration : 18 ఏళ్లు పైబడిన వారు కరోనా టీకా కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి
Corona effect : భారత్ నుంచి ప్రయాణాలపై ఆస్ట్రేలియా ఆంక్షలు
దేశంలో అందుబాటులోకి మరో టీకా.. జైడస్ క్యాడిలా టీకాకు డీసీజీఐ అనుమతి
కొవిడ్ రోగి బర్త్ డే వేడుకలు.. వీడియో వైరల్
రూపాయికే ఆక్సిజన్ సిలిండర్ రీఫిల్ : వ్యాపారి ఔదార్యం
మే మూడో వారంలో కరోనా మరింత ఉద్ధృతం: ఎస్బీఐ రిపోర్ట్
లాభం తీసుకోకుండానే వ్యాక్సిన్లు ఇస్తాం.. ఇండియాకు ఫైజర్ ఆఫర్
గుజరాత్ లో దారుణం : కొవిడ్ బెడ్ కోసం రూ 9000కు బేరం
బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- jabardasth
- roja
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో గెలిచిన మేయర్లు, చైర్పర్సన్ల ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే ?
Jairam Ramesh | రాముడి పేరుతో పాపాలు ఇంకెన్నాళ్లు..? బీజేపీపై జైరాం రమేష్ ఆగ్రహం
Talasani Srinivas Yadav | ఆర్జేడీ నేత తేజస్విప్రసాద్ యాదవ్, ఎస్పీ నేతలకు తలసాని స్వాగతం.. వీడియో
cop caught in woman’s home | అర్ధరాత్రి వేళ మహిళ ఇంట్లో పోలీస్ అధికారి.. చుట్టుముట్టిన గ్రామస్తులపై కాల్పులు, ఒకరు మృతి
అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

