రూపాయికే ఆక్సిజన్ సిలిండర్ రీఫిల్ : వ్యాపారి ఔదార్యం

లక్నో : కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో మహమ్మారి బారినపడిన రోగులు ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్నారు. ఆక్సిజన్ పడకలు లభించక దేశవ్యాప్తంగా పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. విపత్తు వేళ దళారులు ఆక్సిజన్ సిలిండర్ ను రూ 30,000కు బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నారు. స్వార్ధపరుల కాసుల దాహం ఇలా ఉంటే యూపీలోని హమీర్పూర్ జిల్లాలో మనోజ్ గుప్తా అనే వ్యాపారి కేవలం రూపాయికే ఆక్సిజన్ సిలిండర్లను రీఫిల్లింగ్ చేస్తూ కరోనా రోగులకు కొండత అండగా నిలిచారు.
తన బాట్లింగ్ ప్లాంట్లలో గుప్తా ఇప్పటివరకూ వేయికి పైగా ఆక్సిజన్ సిలిండర్లను నింపి వేలాది మంది కొవిడ్ రోగుల ప్రాణాలు కాపాడారు. తాను ఈ విపత్కర పరిస్థిని ఎదుర్కొన్నానని అందుకే కరోనా రోగుల బాధను అర్ధం చేసుకుని రూపాయికే ఆక్సిజన్ సిలిండర్ రీఫిల్ చేస్తున్నానని గుప్తా చెప్పుకొచ్చారు. తమ రిమ్జిమ్ ఇస్పాత్ ఫ్యాక్టరీలో రోజుకు వేయి ఆక్సిజన్ సిలిండర్లను రూపాయికే రీఫిల్ చేసి అవసరార్ధులకు అందిస్తున్నానని గుప్తా పేర్కొన్నాడు. హోంఐసోలేషన్ లో ఉన్న కొవిడ్ రోగుల బంధువులు రోగి ఆర్టీపీసీఆర్ రిపోర్ట్, డాక్టర్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు చూపి ఆక్సిజన్ సిలిండర్లను రీఫిల్ చేయించుకుంటున్నారు. ఝాన్సీ, బందా, లలిత్ పూర్, కాన్పూర్, ఓరై, లక్నో సహా పలు జిల్లాల నుంచి తమ ఆప్తుల ప్రాణాలను కాపాడుకునేందుకు గుప్తా ఆక్సిజన్ బాట్లింగ్ ప్లాంట్ ఎదుట బారులు తీరుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

