లంగా డాన్సులేసే స్టార్లకు 50 కోట్లా.. PVP ట్వీట్ వైరల్
PVP | మహేష్ బాబు, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించిన పీవీపీ సంచలన ట్వీట్ చేశాడు. హీరోలను లంగా డ్యాన్సులేసే స్టార్లు అంటూ ట్వీట్ చేశాడు.

తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. ఏ ఇండస్ట్రీలో అయినా కూడా స్టార్ హీరోలను పన్నెత్తి మాట అనడానికి కూడా ఆలోచిస్తుంటారు నిర్మాతలు. అలాంటిది ఇప్పుడు ఓ టాలీవుడ్ నిర్మాత.. అందులోనూ మహేష్ బాబు, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించిన అనుభవం ఉన్న పీవీపీ ( PVP ) సంచలన ట్వీట్ చేశాడు. హీరోలను లంగా డ్యాన్సులేసే స్టార్లు అని అంటూ పీవీపీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. పీవీపీ ( PVP ) ఏ సందర్భంలో ట్వీట్ చేశాడంటే..
ఈ మధ్యే ముంబైలోని వంగానీ రైల్వే స్టేషన్లో జరిగిన ఘటన అందరికీ తెలుసు. అక్కడ ఓ చిన్న పిల్లాడు అమ్మ చేతుల్లోంచి జారి అదుపు తప్పి పట్టాలపై పడియింది. అప్పుడే ఎదురుగా ట్రైన్ వస్తుంది. అక్కడే పనిచేసే మయూర్ షేక్ అనే ఉద్యోగి ఇది గమనించాడు. ప్రాణాలకు తెగించి వేగంగా పరుగెత్తుకొచ్చి బాలుడిని కాపాడాడు. దీంతో రియల్ హీరో అని అందరితో ప్రశంసలు అందుకున్నాడు. మయూర్ షేక్‌ను చేసిన పనిని అభినందిస్తూ రైల్వే శాఖ 50 వేల రివార్డును కూడా ప్రకటించింది. అధికారులు జావా మోటార్ బైక్‌ను బహుమతిగా ఇచ్చారు. దీనిపై ఇప్పుడు వైసీపీ నేత, ప్రముఖ నిర్మాత పీవీపీ ఒక ట్వీట్ చేశాడు. రియల్ హీరో బాబు, రీల్ హీరో కాదు.. లంగా డాన్సులేసే సార్లకు 50 కోట్లు, ఈ రియల్ హీరోకి జస్ట్ జావా బైక్.. హతవిధి! మనం చేసే కొంచమైనా, కొట్టే సీటీమార్ లైనా ఇలాంటి సూపర్ హీరోస్ కి కొడదాం బ్రదర్స్ అంటూ ఈయన రాసుకొచ్చాడు.
రియల్ హీరో బాబు, రీల్ హీరో కాదు 👍
— PVP (@PrasadVPotluri) April 22, 2021
లంగా డాన్సులేసే సార్లకు 50 కోట్లు, ఈ రియల్ హీరోకి జస్ట్ Jawa బైక్.. హతవిధి!
మనం చేసే కొంచమైనా,కొట్టె సీటీమార్ లైనా ఇలాంటి సూపర్ హీరోస్ కి కొడదాం బ్రదర్స్ 👍 pic.twitter.com/khkOY3O05F
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు పీవీపీపై మండి పడుతున్నారు. కావాలనే ఈయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఆయన నైతికత ఏంటో అర్థమవుతుంది అంటూ విమర్శిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు నిర్మాతలుగా సినిమాలు చేసిన పీవీపీ.. ఆ హీరోలనే లంగా హీరోలు అని అనడంపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. లంగా డ్యాన్సులు వేసే రీల్ హీరోల చుట్టూ సినిమాల కోసం తిరిగిన లంగా గాడికి ఉన్నట్లుండి నీతులు గుర్తొస్తున్నాయా? మీకు సినిమాలు చేసిన హీరోలు ఈరోజు లంగా గాళ్లు అయ్యారా..? ఒకరిని పొగడటం కోసం వృత్తిలో భాగమైన వారిని కించపరచడం వైసీపీ నాయకుల చీప్ మెంటాలిటీ అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఏదేమైనా కూడా ఈ ట్వీట్ అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
జబర్దస్త్‌లో ఇక రోజా కనిపించదా.. అభిమానుల్లో మొదలైన అనుమానాలు
ఈషా రెబ్బా హాట్ పోజు.. శరీరాన్ని ఇంద్ర ధనస్సులా తిప్పేసిన తెలుగమ్మాయి
సోనూసూద్‌కు కరోనా నెగిటివ్..ఆనందంలో ఫ్యాన్స్..!
అల్లు అర్జున్ చేసిన పనికి షాకైన భార్య
హీరోయిన్ సరదా తీర్చేశాడు..షాకిచ్చాడు
కేటీఆర్‌కు కరోనా.. త్వరగా కోలుకోవాలి అంటూ చిరు ట్వీట్
దృశ్యం2 సినిమాపై పుకార్లు.. ఖండించిన సురేష్ బాబు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Angomcha Bimol | ఆ ఎంపీని సస్పెండ్ చేయండి.. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు
Eye Sight | భారతీయుల్లో పెరుగుతున్న దృష్టి లోపం సమస్య.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు..
Dubai ETCA | దుబాయ్‌లో ఘనంగా ETCA 16వ బతుకమ్మ సంబరాలు.. 6 వేల మందికిపైగా తెలంగాణ ప్రవాసుల భాగస్వామ్యం
కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

