ఈ మధ్యకాలంలో పీపుల్స్ మీడియా సంస్థ నుంచి వచ్చిన సినిమాలు తెలుగులో ఏ నిర్మాణ సంస్థ నుంచి రాలేదని చెప్పొచ్చు. ప్రస్తుతం పది సినిమాలకు పైగా నిర్మాణంలో వున్ ఆ సంస్థలో మరో అరడజను సినిమాలు చర్చల దశలో వున్నాయి. ఇటీవల ఈ సంస్థ నుంచి రామబాణం, బ్రో, ఈగల్, మనమే, బబుల్గమ్, మిస్టర్ బచ్చన్ సినిమాలు విడుదలయ్యాయి. వీటితో పాటు ప్రస్తుతం రాజాసాబ్, శ్వాగ్, తెలుసు కదా.. గూఢాచారి-2, శ్రీనువైట్ల, గోపీచంద్ సినిమా ఇలా పలు సినిమాలు నిర్మాణ దశలో వున్నాయి.
అయితే త్వరలోనే ఈ సంస్థ నిర్మించిన శ్రీవిష్ణు శ్వాగ్ విడుదలకు సిద్దంగా వుంది. హసిత్ గోలి దర్శకత్వంలో నిర్మించిన గురువారం ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. పూర్తి వినోదాత్మకంగా రూపొందిన ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే గురువారం ఈ సినిమా టీజర్ రిలీజ్ వేడుకలో పీపుల్స్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ ఆసక్తకిరమైన వ్యాఖ్యాలు చేశారు. ఓ విలేకరి రాజా సాబ్ సినిమా ఎలా వుండబోతుంది. కమర్షియల్ ఎలాంటి రికార్డులు సృష్టించబోతుంది అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ..
‘ప్రభాస్ రాజాసాబ్ సినిమా ఏప్రిల్‌లో వస్తుంది.. మాకు ఇప్పటి దాకా వచ్చినా లాసెస్ అన్నీ రాజాసాబ్ కవర్ చేస్తుంది’ అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. ఇది విన్న అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఈ సంస్థ నుంచి రీసెంట్గా వచ్చిన మిస్టర్ బచ్చన్‌తో కలిసి దాదాపు అరడజను ఫ్లాప్‌లు ఈ సంస్థకు వున్నాయి. అంటే దాదాపు 500 కోట్లకుపైగా నష్టాలు చవిచూశారు. ఇక విశ్వప్రసాద్ హీరో ప్రభాస్, దర్శకుడు మారుతిపై పెద్ద బరువునే వేశాడు. ఇప్పటి వరకు దాదాపు 50 శాతం షూటింగ్‌ను పూర్తిచేసుకున్న రాజాసాబ్ తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది.
అయితే రాజాసాబ్ విజయంపై ఎంతో కాన్పిడెంట్‌గా వున్న నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్లో టాక్‌ఆఫ్ ద ఇండస్ట్రీగా మారాయి. ఇక రాజాసాబ్ నిర్మాత ఆశించినట్లుగానే ఈ సినిమా మంచి విజయం సాధించి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నష్టాల నుంచి బయటపడి లాభాల్లోకి రావాలని మనం కోరుకుందాం..!