హను-మాన్ చిత్రాన్ని ప్రదర్శించండి
నైజాం ప్రాంతంలో ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం కొన్ని థియేటర్లలో ‘హను-మాన్' చిత్రాన్ని ప్రదర్శించడంలేదని, ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుతూ ‘హను-మాన్' చిత్ర డిస్ట్రిబ్యూటర్స్ మైత్రీ మూవీ మేకర్స్, నిర్మాత నిరంజన్ రెడ్డి తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలిలో (టీఎఫ్‌పీసీ) ఫిర్యాదు చేశారు.
నైజాం ప్రాంతంలో ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం కొన్ని థియేటర్లలో ‘హను-మాన్’ చిత్రాన్ని ప్రదర్శించడంలేదని, ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుతూ ‘హను-మాన్’ చిత్ర డిస్ట్రిబ్యూటర్స్ మైత్రీ మూవీ మేకర్స్, నిర్మాత నిరంజన్ రెడ్డి తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలిలో (టీఎఫ్‌పీసీ) ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై టీఎఫ్‌పీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో శనివారం ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది.
“హను-మాన్’ చిత్రాన్ని ఈ నెల 12 నుంచి ప్రదర్శించేందుకు తెలంగాణలోని కొన్ని థియేటర్లతో మైత్రీ మూవీ డిస్ట్రిబూటర్స్ ముందస్తు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే అగ్రిమెంట్‌ను బేఖాతరు చేస్తూ పలు థియేటర్లలో సినిమాను ప్రదర్శించడం లేదు. దీనివల్ల చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు ఎంతో నష్టం జరిగింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం చిత్రాన్ని వెంటనే థియేటర్లలో ప్రదర్శించాలి. ఇప్పటివరకు జరిగిన ఆర్థిక నష్టాన్ని భరించాలి’ అని నిర్మాతల మండలి ప్రెస్‌నోట్‌లో పేర్కొంది. తేజ సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

