టాలీవుడ్ (Tollywood) లో వన్ ఆఫ్ ది లీడింగ్ స్టార్ డైరెక్టర్ జాబితాలో టాప్ ప్లేస్ లో ఉంటాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas). ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో భీమ్లానాయక్ చిత్రానికి రైటర్ గా వ్యవహరిస్తూ తీరిక లేకుండా ఉన్నాడు. మరోవైపు సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేసేందుకు కూడా రెడీ అవుతున్నాడు. ఈ మాటల మాంత్రికుడు సినీ లవర్స్ లో జోష్ నింపేందుకు అద్బుతమైన ప్రసంగం ఇచ్చాడు. ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారా..? అక్కినేని హీరో సుశాంత్ (Sushant) నటిస్తోన్న తాజా చిత్రం ఇచట వాహనములు నిలుపరాదు (Ichata Vahanamulu Nilupa Radu).
మంగళవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు త్రివిక్రమ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. సుశాంత్ కథ ఎంపిక చేసుకునే విధానంపై ప్రశంసలు కురిపించాడు త్రివిక్రమ్. అల వైకుంఠపురంలో సినిమా చేస్తున్నపుడు తాను ఈ సినిమా చేస్తున్నట్టు సుశాంత్ నాతో చెప్పాడు. ఆ తర్వాత ఈ సినిమా బాగా వచ్చిందని నేను విన్నాను. మొదట్లో సుశాంత్ ఏదో ఒక చట్రంలో ఇరుక్కుపోతున్నాడనిపించింది. అయితే చిలసౌ సినిమా తర్వాత సుశాంత్ కథల ఎంపికలో మార్పు వచ్చింది. ఈ సినిమా చూసే నేను అల వైకుంఠపురంలో సినిమాలో చేయాలని అడిగానని చెప్పుకొచ్చాడు త్రివిక్రమ్. ఈ సినిమా సుశాంత్ కు మంచి విజయం అందించాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు.
లాక్ డౌన్ తర్వాత థియేటర్ల పరిస్థితిపై త్రివిక్రమ్ మాట్లాడుతూ..కేవలం భారత్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూసేందుకు ధైర్యంగా ముందుకొస్తున్నారు. అందువల్ల ఎవ్వరూ బాధపడాల్సిన అవసరమే లేదు. మంచి కథలను సిద్దం చేసి ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు రెడీ అవ్వాలని యువ రైటర్ కమ్ డైరెక్టర్లకు సూచించాడు త్రివిక్రమ్. ఇచట వాహనములు నిలుపరాదు ఆగస్టు 27న విడుదలవుతుంది .
That's a Grand & Successful #IVNRpreReleaseEvent 🎉✨
— Suresh Kondeti (@santoshamsuresh) August 25, 2021
pics from yesterday. 📸
👉👉#IVNRfromAug27th 👈👈#IchataVahanamuluNilupaRadu #IVNR@AIStudiosOffl @ravishastrioffl @ShaastraMovies @iamSushanthA @_meenakshii @darshn2012 @adityamusic pic.twitter.com/CBYfbtYhMr
ఇవికూడా చదవండి..
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!