తెలుగు చిత్రసీమ అంటే బాలీవుడ్ సొగసరి జాన్వీకపూర్‌కు ప్రత్యేకమైన అభిమానం. తన దక్షిణాది అరంగేట్రం తెలుగు ఇండస్ట్రీ నుంచే ఉంటుందని ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పిందీ భామ. కోరుకున్న విధంగానే ఎన్టీఆర్ 30వ చిత్రం ద్వారా జాన్వీకపూర్ తెలుగు తెరకు పరిచయమవుతున్న విషయం తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌తో కలిసి నటించడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది జాన్వీకపూర్. ఆమె మాట్లాడుతూ ‘ఎన్టీఆర్‌ను నేను ఎంతగానో అభిమానిస్తాను.
ఆయనతో నటించే అవకాశం వస్తే బాగుండునని ప్రతి రోజూ దేవుణ్ణి కోరుకునేదాన్ని. చివరకు నా కల నిజమైంది. ఈ సినిమా ప్రారంభోత్సవం గురించి ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. సెట్లో అడుగుపెట్టాలని చాలా ఉత్సాహంగా ఉంది. ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ నటనకు ఫిదా అయ్యా. ఆయన ఛరిష్మానే వేరు’ అని చెప్పింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ నెల 23న ప్రారంభోత్సవం జరుపుకోనుంది.