సినీ దర్శకురాలు అపర్ణ మల్లాది (54) శుక్రవారం కన్నుమూశారు. గతకొంతకాలంగా ఆమె క్యాన్సర్‌తో బాధపడుతోంది. అమెరికాలో చికిత్స తీసుకుంటూ అక్కడే మృతి చెందారు. ‘ది అనుశ్రీ ఎక్స్పెరిమెంట్స్’ అనే చిత్రంతో అపర్ణ మల్లాది దర్శకురాలిగా పరిచయమయ్యారు. ‘పోష్ పోరీస్’ వెబ్‌సిరీస్ ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. రెండేళ్ల క్రితం ‘పెళ్లి కూతురు పార్టీ’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. కొన్ని చిత్రాలకు కథలను అందించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు. అపర్ణ మల్లాది మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.