పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచమని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం మాట తప్పిందని అన్నారు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ జేవీఆర్. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచడం వల్ల చిన్న చిత్రాలకు అన్యాయం జరుగుతున్నదని, థియేటర్స్‌కు రావాలంటే ప్రేక్షకులు భయపడే పరిస్థితి ఏర్పడుతున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సినీ పరిశ్రమతో జరిగిన చర్చల్లో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో పాటు సీనియర్ నిర్మాత రామకృష్ణ గౌడ్క ఆహ్వానం లేకపోవడం బాధాకరమని జేవీఆర్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘టికెట్ రేట్లు పెంచడం వల్ల ప్రభుత్వం మాట తప్పిందనే విషయంలో ప్రజల్లోకి వెళ్లింది. ప్రభుత్వం ఇప్పటికైనా మాట మీద నిలబడాలి. టీఎఫ్‌సీసీలో 35 వేల మంది కార్మికులు, 16 వేల మంది సభ్యులున్నారు. ప్రతాని రామకృష్ణగౌడ్‌కు నిర్మాతగా సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన్ని ప్రభుత్వం సినీ పరిశ్రమతో జరిగిన చర్చల్లో పిలవ కవపోవడం బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వం టీఎఫ్‌సీసీని గుర్తించి ప్రాధాన్యం ఇవ్వాలి’ అన్నారు.