తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలను నవంబర్ 14న నిర్వహించబోతున్నట్లు చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుతం 30 మందితో కూడిన టీఎఫ్‌సీసీ పాలక మండలి గడువు ముగియనుంది. మరో రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తాం. నవంబర్ 14న ఎన్నికలు నిర్వహిస్తాం. గత ఏడేళ్లుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో అసోసియేషన్ ముందుకు సాగుతుంది. ఇందులో ఎనిమిది వేల మంది సినీ కార్మికులు, 800 మంది నిర్మాతలు, 400 ఆర్టిస్టులు సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే అనేక మార్గాల ద్వారా కార్మికులకు, నటీనటులకు టీఎఫ్‌సీసీ సహాయాన్ని అందిస్తున్నది’ అని తెలిపారు.