రెండు మూడు ఫ్లాపులు వచ్చిన తర్వాత కుర్ర హీరోల వైపు నిర్మాతలు చూడటం కష్టమే. కానీ కొందరు హీరోలు మాత్రం ఫ్లాప్‌లు వచ్చినా కూడా వరుస సినిమాలు చేస్తూనే ఉంటారు. ఆ జాబితాలోకి వచ్చే హీరో తేజ సజ్జ. 1997లో ప్రియరాగాలు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మూడేళ్ల వయసులో ఇండస్ట్రీకి వచ్చిన ఈయన.. దాదాపు 40 సినిమాలకు పైగానే నటించాడు. బాల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తేజ సజ్జ. ముఖ్యంగా చిరంజీవి హీరోగా నటించిన ఇంద్ర సినిమాలో చిన్నప్పటి మెగాస్టార్‌గా నటించి క్రేజ్ తెచ్చుకున్నాడు. తెలంగాణ శకుంతలతో నేనున్నానే నాయనమ్మా అంటూ తొడ కొట్టి స్టార్ అయిపోయాడు తేజ. ఇప్పటికీ ఆ డైలాగ్ చెప్తుంటాడు తేజ. ఆ తర్వాత అదే ఊపులో చాలా సినిమాలు చేశాడు ఈ చిన్నోడు.
రెండేళ్ల కింద సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి తెరకెక్కించిన ఓ బేబీ సినిమాతో మళ్లీ పరిచయం అయ్యాడు తేజ. అందులో చాలా కీలక పాత్రలో నటించాడు తేజ. మొన్నటికి మొన్న ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన జాంబి రెడ్డి సినిమాతో లీడ్ హీరోగా మారిపోయాడు. ఈ మధ్యే ఇష్క్ ఇట్స్ నాట్ ఎ లవ్‌స్టోరీ అనే సినిమాతో వచ్చాడు. అయితే ఈ సినిమా వచ్చి పోయినట్లు కూడా ఎవరికీ తెలియదు. తొలిరోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుని.. కనీసం కోటి రూపాయల వసూళ్లు కూడా తీసుకురాలేకపోయింది. అయినా కూడా ఈ కుర్రాడి చేతిలో ప్రస్తుతం మరో రెండు సినిమాలున్నాయి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్తో పాటు అద్భుతం అనే మరో సినిమాలోనూ నటిస్తున్నాడు తేజ.ఇందులో హనుమాన్ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకుడు. అద్భుతం సినిమాకు ఆయనే కథ అందించాడు. తాజాగా ఈ సినిమాలోని పాట విడుదలైంది. మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో జీవిత రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ హీరోయిన్గా నటిస్తోంది.
ఇదిలా ఉంటే తేజ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చినట్లు తెలుస్తుంది. జాంబి రెడ్డి సినిమాకు థియేట్రికల్ కలెక్షన్స్‌తో పాటు డిజిటల్, శాటిలైట్ అన్నీ కలిపి 10 కోట్లకు పైగానే వచ్చినట్లు అంచనా. అందుకే ఈ కుర్రాడు సినిమాకు కోటి రూపాయల పారితోషికం అందుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. నిర్మాతలు కూడా అన్ని లెక్కలు వేసుకున్న తర్వాత సరే ఇవ్వొచ్చు అనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఏదేమైనా చాలా వేగంగా ఎదుగుతున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
Cinema review: నూటొక్క జిల్లాల అందగాడు
ఫ్రెండ్స్‌తో సైకిల్‌పై చక్కర్లు కొడుతున్న సమంత.. పిక్ వైరల్
భీమ్లా నాయక్ పాటపై ఐపీఎస్ ఆఫీసర్ అభ్యంతరం