Mirai | తేజా సజ్జా హీరోగా వస్తున్న మిరాయ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విభిన్నమైన కథాంశంతో, అద్భుతమైన గ్రాఫిక్స్ ఈ సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది. ఇది కాస్త పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి భారీ లాభాలను తీసుకొస్తుంది. సినిమా విడుదలకు ముందే దాదాపు 20 కోట్ల వరకు లాభాలు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో బాక్సాఫీసు వద్ద గత సినిమాల నష్టాల నుంచి పీపుల్ మీడియా ఫ్యాకర్టీ తేరుకుంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మిరాయ్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రూ.60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించింది. అద్భుత దృశ్యకావ్యంగా నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. కానీ ఇప్పటికే ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు ( ఓటీటీ, శాటిలైట్ హక్కులు) కింద దాదాపు 45 కోట్లను సంపాదించిందని తెలుస్తోంది. దీంతో టేబుల్ ప్రాఫిట్ కింద రూ.20 కోట్లు అందుకుందని సమాచారం. ప్రస్తుతం బాక్సాఫీసు దగ్గర సినిమాల ఫలితాలను బట్టి చూస్తే ఇది చిన్న విజయం కాదనే చెప్పొచ్చు.
ఎందుకంటే.. ఈ ఏడాదిలో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రాలు.. తిరిగి డబ్బులను తీసుకురావడంలో విఫలమయ్యాయి. ముఖ్యంగా పాన్ ఇండియా ట్రెండ్‌ను ఫాలో అవుతూ, మార్కెట్‌ను మించి బడ్జెట్ పెట్టడం ద్వారా ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి. కానీ ఈ విషయంలో తేజా సజ్జా తెలివిగా వ్యవహరిస్తున్నారు. అనవసరపు హడావుడికి వెళ్లకుండా కంటెంట్ ప్రాధాన్యం ఉన్న సినిమాలను ఎంచుకుంటున్నాడు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా కంటెంట్‌ను నమ్ముకునే మిరాయ్ సినిమాను తెరకెక్కించింది. పాన్ ఇండియా స్టోరీ అని భారీ బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్ జోలికి వెళ్లకుండా రూ.60 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించింది. అదనపు హడావుడితో కాకుండా కంటెంట్‌ను నమ్ముకుని ఈ సినిమాను నిర్మించింది. ఇటీవల విడుదలైన మిరాయ్ ట్రైలర్ దాన్ని నిరూపిస్తోంది.
తాజాగా విడుదలైన మిరాయ్ ట్రైలర్‌కు తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ అంచనాల కారణంగానే డైరెక్ట్‌గా తామే ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. థియేట్రికల్ హక్కుల కోసం ప్రీమియం చెల్లించేందుకు డిస్ట్రిబ్యూటర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ, కంటెంట్‌పై ఉన్న నమ్మకం కారణంగా ఈ సినిమాను మేకర్స్ సొంతంగా విడుదల చేస్తున్నారు. రిలీజ్‌కు ముందే రూ.20 కోట్ల వరకు లాభాలు తీసుకొచ్చిన మిరాయ్.. విడుదల తర్వాత మరెన్ని లాభాలు తీసుకొస్తుందో చూడాలి.!