తేజ సజ్జా కథానాయకుడిగా సూపర్‌హీరో కథాంశంతో రూపొందిస్తున్న చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్ నిర్మాతలు. సెప్టెంబర్ 5న విడుదలకానుంది. శనివారం చిత్రబృందం మ్యూజికల్ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టింది.
‘వైబ్ ఉంది..’ అనే తొలిపాటకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ‘వైబ్ ఉంది బేబీ, వైబ్ ఉందిలే. ఈ గ్లోబ్ని ఊపే వైబ్ ఉందిలే’ అంటూ యూత్‌ఫుల్‌గా ఈ పాట సాగింది. గౌరహరి స్వరపరచిన ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు. నాయకానాయికలు తేజ సజ్జా, రితికా నాయక్ తమ డ్యాన్స్‌తో అదరగొట్టారు. విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. దుష్టశక్తుల నుంచి ఈ ప్రపంచాన్ని రక్షించే ఓ యోధుడి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని చిత్రబృందం పేర్కొంది.