Teja Sajja | ‘హను-మాన్’తో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నాడు యువకథానాయకుడు తేజ సజ్జా. అతని తర్వాతి సినిమాకోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఎట్టకేలకు అతని తాజా సినిమా ప్రకటన వెలువడింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించనున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. సోమవారం ఈ సినిమాకు చెందిన పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
పోస్టర్లో తేజ సజ్జ తన ముఖంలో ఇంటెన్సిటీతో బ్యాక్ పోజ్‌లో కనిపిస్తున్నాడు. ‘హను-మాన్’తో సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన తేజా.. ఈ సినిమాలో ైస్టెలిష్ మేక్ ఓవర్‌తో సూపర్యోధగా కనిపిస్తున్నాడు. ఈ నెల 18న ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించనున్నట్టు మేకర్స్ తెలిపారు.
లార్జర్ దేన్ లైఫ్ కథాంశంతో, సాహసోపేత వీరగాధగా ఈ సినిమా ఉండనుందని దర్శకుడు తెలిపారు. హై టెక్నికల్ వేల్యూస్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నదని, ఈ నెల 18న సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు కూడా వెల్లడిస్తామని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి రచన: మణిబాబు కరణం, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల.