మల్టీ టాలెంటెడ్ తరుణ్‌భాస్కర్ ప్రధాన పాత్రలో ఓ చిత్రం రూపొందనుంది. వంశీరెడ్డి దొండపాటి దర్శకుడు. బూసం జగన్మోహన్రెడ్డి నిర్మాత. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన శుక్రవారం వెలువడింది. శ్రీనివాస్‌గౌడ్ అనే వ్యక్తి.. అతని భార్య శ్రీలత నుంచి విడాకులు తీసుకున్నట్టు సూచించే ఓ స్టాంప్ పేపర్‌తో విభిన్నంగా ఈ సినిమాను మేకర్స్ అనౌన్స్ చేశారు.
రచయిత, దర్శకుడు వేణు ఊడుగుల ఈ సినిమా స్క్రిప్ట్‌లో భాగమయ్యారు. వినోదంతోపాటు హత్తుకునే భావోద్వేగాలతో కూడిన కథాంశంతో ఈ సినిమా రూపొందనున్నదని, అక్టోబర్‌లో షూటింగ్ మొదలయ్యే ఈ సినిమాకోసం కొత్త వారిని పరిచయం చేయాలనుకుంటున్నామని మేకర్స్ తెలిపారు. యారో సినిమాస్, డోలాముఖి సబ్‌బల్ట్రాన్ ఫిల్మ్స్ పతాకాలపై ఈ చిత్రం రూపొందనుంది.