రమణ్, వర్షా విశ్వనాథ్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘మటన్ సూప్’. ‘విట్నెస్ ది రియల్ క్రైమ్’ అనేది ఉపశీర్షిక. రామచంద్ర వట్టికూటి దర్శకుడు. మల్లిఖార్జున ఎలికా, అరుణ్‌చంద్ర వట్టికూటి, రామకృష్ణ నసపల నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ సినిమా నుంచి ‘హర హర శంకర..’ అని సాగే గీతాన్ని రచయిత, నటుడు తనికెళ్ల భరణి విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు రామచంద్ర వట్టికూటి తెలిపారు. ఇంకా చిత్ర యూనిట్‌తోపాటు శివ మల్లాల, నటి సునీత మనోహర్ కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పర్వతనేని రాంబాబు.