Thalapathy Vijay | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగానూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోటిచేయగా.. ఏకంగా 164 సీట్లు గెలిచింది. సుమారు 94 శాతం సీట్లు సాధించి దేశంలోనే సంచలనం రేపింది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించింది. ఇక జనసేన పార్టీ ఘన విజయం సాధించడంతో రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో, తమిళ వెట్రి కళగం(Tamilaga Vettri Kazhagam) పార్టీ అధినేత దళపతి విజయ్ (Vijay) కూడా పవన్ కల్యాణ్, చంద్రబాబులకు శుభాకాంక్షలు తెలిపాడు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్ కల్యాణ్ కు అభినందనలు. ఏపీ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించినందుకు ఆనందంగా ఉంది. ప్రజల కోసం మీరు కట్టుబడిన తీరు, మీ పట్టుదల అందరికి స్ఫూర్తి దాయకం. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను అంటూ రాసుకోచ్చాడు విజయ్.
Congratulations to @PawanKalyan garu on your formidable victory & for the emergence of @JanaSenaParty as 2nd largest in the assembly elections. Your endurance & dedication to serve the people of AP has been commendable. Best wishes.
Vijay,
President,
Tamilaga Vettri Kazhagam— TVK Vijay (@tvkvijayhq) June 4, 2024
మరోవైపు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఏపీ ఎన్నికల్లో భారీ విజయం సాధించినందుకు చంద్రబాబు గారికి అభినందనలు. మీ నాయకత్వంలో ఏపీ అభివృద్ధి అవుతుందని ఆశిస్తున్నాను అంటూ ఎక్స్‌లో రాసుకోచ్చాడు.
Congratulations to Shri @ncbn garu and @JaiTDP for the decisive victory in the assembly elections to lead #AndhraPradesh
Wishing the people of AP great progress under your visionary leadership.
Vijay,
President,
Tamilaga Vettri Kazhagam— TVK Vijay (@tvkvijayhq) June 4, 2024