లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో, గురుప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘ఝాన్సీ ఐపీఎస్’. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ ఈ నెల 22న తెలుగులో విడుదల చేస్తున్నారు. తమిళంలో సూపర్‌హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉందని, లక్ష్మీరాయ్ ఇందులో త్రిపాత్రాభినయం చేశారని, మాదక ద్రవ్యాలతో విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్ ముఠా ఆటకట్టించే ఐపీఎస్ ఆఫీసర్‌గా, గ్రామాల్లో రౌడీల ఆగడాలకు అడ్డుకట్టవేసే ఉగ్రనారిగా, కుర్రకారుని ఉర్రూతలూగించే అందాలరాశిగా లక్ష్మీరాయ్ నట విశ్వరూపాన్ని ఇందులో చూస్తారని ప్రతాని రామకృష్ణగౌడ్ చెప్పారు. ఇంకా నటి ఆక్సాఖాన్, నటుడు జె.వి.ఆర్ కూడా మాట్లాడారు.