Aditi Shankar | ఈ అమ్మాయి పేరు అతిథి శంకర్. ఈ అందాలబొమ్మది సామాన్యమైన నేపథ్యం కాదు. దక్షిణాది సినిమాను పానిండియా స్థాయికి తీసుకెళ్లిన గ్రేట్ డైరెక్టర్ శంకర్ ముద్దుల తనయే ఈ ముద్దుగుమ్మ. ఈమె మంచి గాయని కూడా. వరుణ్‌తేజ్ నటించిన ‘గని’ సినిమాలో ఓ పాట కూడా పాడింది. ఎంబీబీఎస్ చదివింది. అసలు విషయం ఏంటంటే.. ఈ చెన్నై చందమామ త్వరలో కథానాయికగా తెలుగుతెరపై అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. సినిమా పేరు ‘వీర ధీర శూర’.
బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ఇందులో కథానాయకులు. ఇది తమిళ చిత్రం ‘గరుడన్’కి రీమేక్. విజయ్ కనకమేడల దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతున్నది. అతిథి కూడా సెట్లోకి అడుగుపెట్టింది. ముగ్గురు స్నేహితుల కథగా ఈ సినిమా రూపొందుతున్నదని, స్నేహం, స్వార్థం, ప్రతీకారం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ఫిల్మ్ వర్గాల సమాచారం. ఈ సినిమాలో మరో కథానాయిక కూడా ఉందట. ఆమె పేరు త్వరలో ప్రకటిస్తారట.