80ల్లో చిరంజీవి, బాలకృష్ణ ఏడాదికి ఏడెనిమిది సినిమాలు చేసేవారు. ఇప్పుడైతే ఒక స్టార్ హీరో ఏడాదికి ఒక సినిమా విడుదల చేస్తే గొప్ప. అయితే.. తమిళ అగ్ర హీరో ధనుష్ మాత్రం 80ల నాటి హీరోల స్పీడ్లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో అరడజను సినిమాలున్నాయి. ఈ ఏడాదిలోనే రెండు సినిమాలు విడుదల కానున్నాయి.
వాటిలో ఒకటి టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ‘కుబేర’ కాగా, రెండోది ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న ‘ఇడ్లీ కడై’. రీసెంట్గా ‘ఇష్క్ మైన్’ అనే బాలీవుడ్ సినిమాకు కూడా ఓకే చెప్పారు ధనుష్. ఈ క్రమంలోనే శేఖర్ కమ్ముల చెప్పిన కథను ఓకే చేసి, వెంటనే ఆయన దర్శకత్వంలోనే మళ్లీ నటించేందుకు రెడీ అయిపోయారు. అలాగే.. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఓ హారర్ థ్రిల్లర్లో నటించనున్నారు. వీటితోపాటు ఇళయరాజా బయోపిక్ ఎలాగూ ఉంది. ఇండియాలో ఇంత బిజీగా ఉన్న స్టార్ హీరో బహుశా ఎవరూ లేరేమో.