రాజమౌళి కంటే ముందు నుంచి కూడా భారీ సినిమాలంటే గుర్తొచ్చే పేరు శంకర్. ఆయన సినిమాల్లో భారీ గ్రాఫిక్స్ కనిపిస్తుంటాయి. కానీ ఈ మధ్య ఆయన వరుస ఫ్లాపుల్లో కూరుకుపోయారు. 2010లో వచ్చిన రోబో తర్వాత ఆ స్థాయి హిట్ రాలేదు. భారీ అంచనాలతో వచ్చిన ఐ సినిమా అంచనాలు అందుకోలేదు. ఇక రోబో 2 గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి సమయంలో రామ్‌చరణ్‌తో సినిమా ప్రకటించాడు శంకర్. వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ ఈ సినిమా కోసం శంకర్ భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
శంకర్ చేతుల్లో ప్రస్తుతం మూడు సినిమాలున్నా కూడా ఒక్కటి కూడా అనుకున్న విధంగా ముందుకు వెళ్లడం లేదు. భారతీయుడు 2 సగంలో ఆగిపోయింది.. రామ్ చరణ్ సినిమా ఇప్పటికీ మొదలు కాలేదు.. అపరిచితుడు హిందీ రీమేక్ ఏంటో అర్థం కావడం లేదు. మిగిలిన సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా రామ్ చరణ్ అభిమానులు మాత్రం ఈ కాంబినేషన్ కోసమే అడుగుతున్నారు. 30 ఏళ్లుగా తెలుగు సినిమా వైపు చూడని శంకర్ ఇప్పుడు స్ట్రెయిట్ సినిమా చేస్తున్నాడు. శంకర్‌తో సినిమా అంటే కచ్చితంగా రెండు మూడేళ్లు అవుతుందని అంతా ఫిక్స్ అవుతారు కానీ రామ్ చరణ్ సినిమాను మాత్రం వీలైనంత త్వరగా పూర్తి చేస్తానంటున్నాడు. ఈ సినిమాలో ఎలాంటి విజువల్ ఎఫెక్ట్స్ కానీ.. స్పెషల్ సీన్స్ కానీ ఉండవంటున్నాడు ఈ దర్శకుడు. ఈ సినిమాను తెరకెక్కించే పనుల్లో ఉండగానే శంకర్‌పై లైకా ప్రొడక్షన్స్ మద్రాసు హైకోర్టులో కేసు ఫైల్ చేసింది. తమ భారతీయుడు 2 సినిమా పూర్తి చేసేదాకా వేరే సినిమా చేయకుండా స్టే ఇవ్వమని కోర్టును కోరింది. కానీ ఆ కేసును మద్రాసు కోర్టు కొట్టేసింది. దీంతో శంకర్, రామ్‌చరణ్ కాంబినేషన్ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ దొరికింది.
ఈ క్రమంలో రామ్‌చరణ్ సినిమా కోసం శంకర్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా కోసం రామ్‌చరణ్ కంటే కూడా ఎక్కువగానే శంకర్ పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రామ్ చరణ్ మాత్రం సినిమా రిలీజ్ తర్వాత వాటా తీసుకోబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Kathi Mahesh | సినీ నటుడు కత్తి మహేశ్ మృతి
కడవరకు కాంట్రవర్సీలతోనే కాపురం చేసిన కత్తి మహేష్
ప్రమాదమే లేదన్నారు కదా.. మరి కత్తి మహేశ్ మరణానికి కారణమేంటి?
సినిమా జర్నలిస్టులకు కష్టకాలం.. వేధిస్తున్న వరుస మరణాలు
ఓటీటీలో సినిమాలు విడుదల చేస్తే థియేటర్లు ఎందుకు.. డిస్ట్రిబ్యూటర్ల ఆగ్రహం