Tamannah | తెలుగు ప్రేక్షకులని తన నటన, డ్యాన్స్ తో ఎంతగానో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ తమన్నా. టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటిస్తూ తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్లలో స్థానం దక్కించుకుంది. వైవిధ్యమైన పాత్రల్లో మెరిసి, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అనేక అవార్డులు కూడా సొంతం చేసుకుంది. చివరిగా ఓదెల 2 చిత్రంతో పలకరించింది. ఈ సినిమా ప్రేక్షకులని అంతగా అలరించలేకపోయింది. అయితే తమన్నా హీరోయిన్గా చేస్తూనే అడపాదడపా స్పెషల్ సాంగ్స్‌లో మెరుస్తూ అదరగొడుతుంది.
తమన్నా నెక్స్ట్ ప్రాజెక్ట్ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.ఆమె విజయ్ వర్మ అనే వ్యక్తితో ప్రేమలో మునిగి తేలింది. కొన్నాళ్ల పాటు ఇద్దరు సరదాగా కలిసి తిరిగారు. ఏమైందో ఏమో కాని ఇటీవల వారు బ్రేకప్ చెప్పుకున్నట్టు సమాచారం. ఇక ఇదిలా ఉంటే తాజాగా తమన్నా స్టన్నింగ్ లుక్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పాలఛాయ లాంటి శరీరం, సన్నని నడుము, చూడచక్కనైన రూపంతో పాలరాతి శిల్పంలా కనిపించే తమన్నా ఇప్పుడు చాలా లావుగా గుర్తు పట్టలేనంతగా మారంది. అసలు ఈమె తమన్నానేనా అని కొందరు నోరెళ్లపెడుతున్నారు.
ఈవిడ మా ఫేవరేట్ హీరోయిన్ తమన్నా కాదు, మిల్కీ బ్యూటీ ఇలా మారిపోవడం ఏంటి, తమన్నాని ఇలా చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు.. అంటూ నెటిజన్లు తమ రియాక్షన్ తెలియజేస్తున్నారు. కొంతమంది అయితే తమన్నా లుక్‌తో కాదు టాలెంట్‌తో ఎదిగింది. మేకోవర్ కావడం ఆమెకు చాలా చిన్న విషయం అంటూ సపోర్ట్ చేస్తున్నారు. తమన్నాపై కొందరు పనిగట్టుకుని బాడీ షేమింగ్‌కి పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. తమన్నా ఇటీవల నటించిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏవి కూడా ఆమె కెరీర్‌కు అంతగా కలిసి రాలేదు. దీంతో ఏదైనా సినిమా కోసమే ఆమె ఇలా లుక్ మార్చి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా అన్ని భాషల్లోనూ హీరోయిన్గా అదరగొట్టింది మిల్కీ బ్యూటీ తమన్నా. స్త్రీ 2 లో చేసిన ఐటెమ్ సాంగ్ లో తమన్నా అందచందాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇటీవల అజయ్ దేవ్‌గణ్ ‘రైడ్ 2’లోనూ ఐటెమ్ సాంగ్‌తో మెరిసింది.