Tamannah | సినీ పరిశ్రమలో దాదాపు రెండు దశాబ్దాలుగా అగ్రశ్రేణి హీరోయిన్గా తన స్థానాన్ని నిలబెట్టుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మరోసారి వార్తల్లో నిలిచారు. గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యం ఇచ్చే క్యారెక్టర్లు చేస్తూ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పరుచుకున్న ఈ భామ, సినిమాలకంటే ఎక్కువగా తన వ్యక్తిగత జీవితంతో చర్చకు వస్తారు. ముఖ్యంగా నటుడు విజయ్ వర్మతో సాగిన ప్రేమాయణం, ఆ తర్వాత జరిగిన బ్రేకప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమన్నా ఈ ప్రేమ జీవితం, బ్రేకప్ గురించి స్పష్టంగా వివరించారు. తమన్నా చెప్పింది, తన జీవితంలో రెండుసార్లు హార్ట్ ముక్కలైందని, మొదటిది టీనేజ్‌లోని ప్రేమ అనుభవమని, కానీ తన లక్ష్యాలు, కెరీర్ కోసం ఆ బంధాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది అని పేర్కొంది.
అప్పట్లో కెరీర్ ముఖ్యం కాబట్టి తీసుకున్న నిర్ణయం సరైనదని ఆమె వెల్లడించారు. తర్వాత మరో వ్యక్తితో రిలేషన్లో ఉన్నప్పటికీ, కొంతకాలం గడిచిన తర్వాత అతను తనకు సరైన జోడీ కాదని గ్రహించి బయటకు వచ్చినట్లు తెలిపారు. “అలాంటి బంధంలో ఉండటం నా వ్యక్తిత్వానికి, భవిష్యత్తుకు ప్రమాదకరం” అని చెప్పడం, “డేంజరస్” అనే పదాన్ని ఉపయోగించడం నెటిజన్లలో ఆసక్తిని రేపింది. ఈ వ్యాఖ్యలతోనే ఆమె విజయ్ వర్మను ఉద్దేశించిందా అని చర్చ మొదలైంది. విజయ్ వర్మతో తమన్నా ప్రేమాయణం గురించి బీటౌన్‌లో కొంతకాలంగా చర్చ జరుగుతూ ఉంది. ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్ సిరీస్‌లో కలిసి నటించిన సమయంలో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు ప్రచారం జరిగింది. సిరీస్‌లోని లిప్‌లాక్, ఇంటిమేట్ సీన్స్ తర్వాత వీరు నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని వార్తలు వైరల్ అయ్యాయి.
ఈవెంట్స్‌కు కలిసి హాజరవడం, ఫోటోషూట్స్ చేయడం, పండగల సందర్భాల్లో కలిసి కనిపించడం వలన అభిమానులు త్వరలో పెళ్లి కూడా జరగబోతుందని ఊహించారు, కానీ అనుకోకుండా వీరి బంధానికి బ్రేకప్ ఏర్పడింది. బీటౌన్ టాక్ ప్రకారం, తమన్నా పెళ్లి ఆలోచించగా, విజయ్ వర్మ కెరీర్‌పై ఎక్కువ దృష్టి పెట్టడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని ప్రచారం జరిగింది. తమన్నా తాజా వ్యాఖ్యలు ఆ పాత రూమర్లను మళ్లీ తెరపైకి తీసుకువచ్చాయి. ఆమె చెబుతూ, “ప్రేమ కంటే ఆత్మగౌరవం, కెరీర్ ముఖ్యం” అని, కెరీర్‌కు ప్రాధాన్యత ఇచ్చి తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కెరీర్ విషయానికి వస్తే, తమన్నా ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. గత ఏడాది ‘ఓడెల్ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓ మోస్తరు విజయాన్ని సాధించారు. ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే, మరోవైపు ఓటీటీలో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటున్నారు. కోలీవుడ్‌లో విశాల్ హీరోగా నటిస్తున్న ‘పురుషన్’ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తారు.