తమన్నాకు కోపమొచ్చింది. ఓ తుంటరి అభిమానికి సున్నితంగా క్లాస్ పీకారు. వివరాల్లోకెళ్తే.. ఇటీవల చెన్నయ్‌లో ఆమె ఫ్యాన్స్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రతి ప్రశ్నకు తమన్నా ఓపిగ్గా, చలాకీగా సమాధానాలిచ్చారు. ఈ క్రమంలో ఓ అభిమాని మీపై వచ్చే నెగెటివ్ ప్రచారాలపై మీరెలా స్పందిస్తారు? అనడిగితే.. ‘విమర్శించడం,
ప్రశంసించడం వ్యక్తిగతానికి సంబంధించిన అంశాలు. వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. అయితే మరీ ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం ఫీలవుతా? అంతకంటే ఏం చేయలేంకదా..’ అని సమాధానమిచ్చారు. ఇంతలో మరొక యువకుడు.. మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారు. మీకు తమిళనాడు అబ్బాయిలు నచ్చరా? అని అడిగాడు.. దాంతో కాస్త అసహనానికి లోనైన తమన్నా.. “నా లైఫ్ ప్రస్తుతం బావుంది. హ్యాపీగా ఉన్నాను. నచ్చడం నచ్చకపోవడం నా సొంత విషయం. మీకనవసరం కదా. నా పేరెంట్సే నన్నెప్పుడూ ఇలా అడగలేదు’ అంటూ సున్నితంగా మందలించారు.