నటుడు విజయ్‌వర్మతో తమన్నా బ్రేకప్ వార్త ఇప్పుడు బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇటీవలే విడిపోయారంటూ వార్తలొస్తున్నాయి. వృత్తిపరమైన అంశాల కారణంగా ఈ జంట మధ్య విభేదాలు తలెత్తాయని తెలుస్తున్నది. ఇటీవల ముంబయి రవీనాటాండన్ నివాసంలో జరిగిన హోలీ వేడుకల్లో కూడా ఈ జంట విడివిడిగానే కనిపించారు. దీంతో ఈ జంట బ్రేకప్ నిజమేనని అభిమానులు నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో తమన్నా పెట్టిన తాజా పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఎప్పుడూ తన వృత్తిపరమైన ఫొటోషూట్స్‌ను షేర్ చేసే తమన్నా ఓ సందేశాత్మక కోట్‌ను పోస్ట్ చేయడం విశేషం. జీవితంలో అద్భుతాలు జరుగుతాయని ఎదురుచూడొద్దని, మనమే వాటిని సృష్టించుకోవాలంటూ తమన్నా తన సందేశంలో పేర్కొంది. బ్రేకప్ బాధ నుంచి ఉపశమనంగా ఆమె ఈ పోస్ట్ పెట్టిందని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం తమన్నా తెలుగులో ‘ఓదెల-2’ చిత్రంలో నటిస్తున్నది.