జమునగా తమన్నా
దిగ్గజ నటి స్వర్గీయ జమున బయోపిక్ రూపకల్పనకు సన్నాహాలు జరుగుతున్నాయి. అలనాటి మేటి నటిగా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్న ఈ నాయిక జీవిత కథను తెరకెక్కించేందుకు తమిళ చిత్ర పరిశ్రమ అడుగుముందుకేసింది.
దిగ్గజ నటి స్వర్గీయ జమున బయోపిక్ రూపకల్పనకు సన్నాహాలు జరుగుతున్నాయి. అలనాటి మేటి నటిగా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్న ఈ నాయిక జీవిత కథను తెరకెక్కించేందుకు తమిళ చిత్ర పరిశ్రమ అడుగుముందుకేసింది. జమున పాత్రలో తమన్నాను నాయికగా సంప్రదించారని సమాచారం. ఈ చిత్రంలో నటించేందుకు తమన్నా కూడా ఆసక్తిగా ఉందట. గతంలో కీర్తి సురేష్ సావిత్రి బయోపిక్ ‘మహానటి’లో నటించి పేరు తెచ్చుకుంది. దక్షిణాది భాషల్లో విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. మహానటి సావిత్రితో పోల్చుకోదగిన సమకాలీకురాలైన జమున జీవిత కథా చిత్రానికి కూడా మంచి ఆదరణ లభిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.
జమున నట జీవితంలో జరిగిన పరిణామాలు, ఆ ఇబ్బందులను ఆమె ధైర్యంగా ఎదుర్కొన్న తీరు, స్టార్ హీరోయిన్గా ఎదిగిన క్రమం అంతా ఓ సినిమాకు కావాల్సిన నాటకీయతను అందిస్తాయని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఇక తమన్నా కెరీర్ చూస్తే తెలుగులో చిరంజీవి సరసన ‘భోళా శంకర్’, కోలీవుడ్‌లో రజనీతో ‘జైలర్’ చిత్రాల్లో నటిస్తున్నది. ఇవి కాక ఆమెకు హిందీలో ‘భోలే చుడియాన్’, మలయాళంలో ‘బాంద్రా’
సినిమాలున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

