మంగళవారం 19 జనవరి 2021
Cinema - Jun 27, 2020 , 00:17:09

బ్యాక్‌గ్రౌండ్‌ కంటే ప్రతిభ ముఖ్యం!

బ్యాక్‌గ్రౌండ్‌ కంటే ప్రతిభ ముఖ్యం!

బాలీవుడ్‌ యువహీరో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య ఉదంతం దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. హిందీ చిత్రసీమలోని బంధుప్రీతి, ఆధిపత్య ధోరణుల వల్లే సుశాంత్‌సింగ్‌ బలవన్మరణానికి పాల్పడ్డారని పలువురు ప్రముఖులు ఆరోపించారు. తాజాగా ఈ విషయం గురించి కథానాయిక కీర్తిసురేష్‌ స్పందించింది. తాను సినీనేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికి ఏ రోజు తల్లిదండ్రుల సహాయాన్ని కోరలేదని చెప్పింది. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నప్పటికీ ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోతే ఎవరూ రాణించలేరని పేర్కొంది. కొత్తవారికి ఆరంభంలో అవకాశాలు సొంతం చేసుకోవడం కష్టమవుతుందని, అయితే పరిశ్రమలో అంతిమంగా ప్రతిభనే కొలమానంగా భావిస్తారని పేర్కొంది. టాలెంట్‌ ఉంటే ఏదోఒకరోజు  విజయాలు వరిస్తాయని చెప్పింది. అయితే సుశాంత్‌సింగ్‌ ఆత్మహత్య తనను షాక్‌కు గురిచేసిందని, ఆ సంఘటన గురించి తన బాధను వ్యక్తం చేయడానికి మాటలు కరువయ్యాయని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘డిప్రెషన్‌తో ప్రాణాలు తీసుకోవడం చాలా బాధాకరం. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య ఇండస్ట్రీలోని యథార్థ పరిస్థితుల్ని తరచిచూసుకునే అవశ్యకతను తెలియజెప్పింది. నెగెటివిటీకి మనందరం దూరంగా ఉండాలి. మన ఆలోచనల కంటే మనోైస్థెర్యమే బలమైనదని గుర్తుంచుకోవాలి. ఒంటరిగా ఎప్పుడూ ఉండకూడదు. సన్నిహితులు సమక్షంలో గడపాలి. పని, డబ్బు గురించి ఆలోచించడం మానుకొని జీవితాన్ని ఆనందింపజేసే విషయాలపై దృష్టిపెట్టాలి’ అని చెప్పింది.