Tabu | ఐదు పదుల వయస్సు దాటినా లీడ్ రోల్స్‌లో నటిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది టబు. ఈ హైదరాబాదీ నటి ఇటీవలే క్రూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. తాజాగా టబు, అజయ్ దేవ్గన్ కాంబోలో నటిస్తున్న చిత్రం Auron Mein Kahan Dum Tha. నీరజ్‌పాండే రైటర్ కమ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించింది అజయ్ దేవ్గన్ టీం.
ఈ మూవీ టీజర్‌ను ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు రిలీజ్ చేయనున్నారు. అజయ్ దేవ్గన్ ఫేస్ సైడ్ లుక్‌తో ఉన్న పోస్టర్‌తో తాజా అప్డేట్ అందించగా.. ఈ లుక్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఎన్‌హెచ్ స్టూడియోస్ సమర్పణలో ఏ ఫ్రైడ్ ఫిల్మ్ వర్క్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శాంతను మహేశ్వరి, జిమ్మీ షేర్గిల్, బెనెడిక్ట్ గర్రెట్, సయీ మంజ్రేకర్‌తోపాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
1st poster of the #AjayDevgn and #Tabu starrer #AuronMeinKahaDumTha.
Get ready for a captivating tale by #NeerajPandey, featuring this iconic duo.
The teaser will be out today at 1 pm!
NH Studios presents, A Friday Filmworks Production, Auron Mein Kahan Dum Tha is produced by… pic.twitter.com/yFovneXRfh
— Ashwani kumar (@BorntobeAshwani) May 31, 2024