HomeCinemaTaapsee Pannu Says Her Success In Bollywood Is Not Just A Fluke Asserts She Did Everything On Her Own
అదే మంచి నిర్ణయం
కెరీర్ ఆరంభంలో కథానాయిక తాప్సీ పేరు వింటే గ్లామర్ పాత్రలే గుర్తుకొచ్చేవి. దక్షిణాది సినిమాలకు విరామం తీసుకొని పూర్తిగా బాలీవుడ్‌పై దృష్టిపెట్టిన తర్వాతే ఈ భామ ప్రయోగాత్మక కథాంశాల్లో మెప్పించింది.
కెరీర్ ఆరంభంలో కథానాయిక తాప్సీ పేరు వింటే గ్లామర్ పాత్రలే గుర్తుకొచ్చేవి. దక్షిణాది సినిమాలకు విరామం తీసుకొని పూర్తిగా బాలీవుడ్‌పై దృష్టిపెట్టిన తర్వాతే ఈ భామ ప్రయోగాత్మక కథాంశాల్లో మెప్పించింది. ముఖ్యంగా పింక్, నామ్ షబానా, ముల్క్ వంటి చిత్రాలు ఆమెకు తిరుగులేని గుర్తింపును తీసుకొచ్చాయి. అతి తక్కువ సమయంలోనే హిందీ చిత్రసీమలో మహిళా ప్రధాన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది తాప్సీ.
లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను ప్రేక్షకులు ఆదరించడం వల్లే తాను బాలీవుడ్లో నిలదొక్కుకున్నానని, లేకుంటే పదేళ్ల క్రితమే కెరీర్ ముగిసిపోయేదని తాప్సీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. ఆమె మాట్లాడుతూ ‘ప్రేక్షకులు లేడీ ఓరియెంటెడ్ కథలను ఆదరించే ధోరణి క్రమంగా పెరుగుతున్నది. ఇదొక శుభపరిణామం.
ది డర్టీ పిక్చర్, కహానీ, క్వీన్ లాంటి సినిమాలు మహిళా ప్రధాన కథలను ఎంచుకోవడానికి ప్రేరణ నిచ్చాయి. ఇండస్ట్రీలో నేను సక్సెస్ కాగలననే నమ్మకాన్ని ఇచ్చాయి. ‘పింక్’ చిత్రంతో కథల ఎంపికలో నా పంథా మార్చుకున్నా. నా కెరీర్లో అదే అత్యుత్తమ నిర్ణయం. అప్పటి నుంచే నటిగా నా ప్రతిభ ప్రపంచానికి తెలిసింది’ అని చెప్పింది. ప్రస్తుతం తాప్సీ హిందీలో మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.