అమితాబచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రలు పోషించిన బాలీవుడ్ సెన్సేషన్ ‘పింక్' సినిమా విడుదలై సెప్టెంబర్ 16కి సరిగ్గా ఎనిమిదేండ్లు. ఈ సందర్భంగా నాటి సంగతులను నటి తాప్సీ గుర్తు చేసుకున్నది.
కెరీర్ ఆరంభంలో కథానాయిక తాప్సీ పేరు వింటే గ్లామర్ పాత్రలే గుర్తుకొచ్చేవి. దక్షిణాది సినిమాలకు విరామం తీసుకొని పూర్తిగా బాలీవుడ్‌పై దృష్టిపెట్టిన తర్వాతే ఈ భామ ప్రయోగాత్మక కథాంశాల్లో మెప్పించింది.