న్యూఢిల్లీ: భారతీయ కోస్టు గార్డు.. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌తో కలిసి .. ఇరానీ నౌకలో అక్రమంగా సరఫరా చేస్తున్న మాదకద్రవ్యాలను సీజ్ చేశారు. అరేబియా సముద్రంలోని లక్షద్వీప్ సమీపంలో ఈ ఘటన జరిగింది. 526 కేజీల నార్కోటిక్స్(Drugs Seized)ను పట్టుకున్నారు. ఆ నౌకను పాకిస్థానీ జాతీయులు నిర్వహిస్తున్నట్లు కోస్టు గార్డులు తెలిపారు. సెప్టెంబర్ 25వ తేదీన ఈ ఆపరేషన్ చేపట్టారు. కోస్టు గార్డులు పట్టుకున్న డ్రగ్స్ విలువ సుమారు 3వేల కోట్లు ఉంటుంది. సముద్ర, వైమానిక నిఘా సహకారంతో నౌకను సీజ్ చేశారు. డ్రగ్స్‌లో హెరాయిన్, మెథంఫిటమైన్ ఉన్నాయి. సీజ్ చేసిన డ్రగ్స్, నౌక సిబ్బందిని ముంబైకి తరలించారు.