Taapsee Pannu | ‘తాప్సీ పెద్ద కాపీ మాస్టర్.. తన సోదరి కంగనా రనౌత్‌ని ఇమిటేట్ చేస్తూ నటిస్తుంది.’ అని కంగనా సోదరి రంగోలి గతంలో మీడియా ముందు వ్యాఖ్యానించి పెద్ద దుమారం రేపింది. ఆ వ్యాఖ్యలపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించింది తప్సీ. ‘ఆమెను అదేవిధంగా అనుకోనివ్వండి. నాకేం ఇబ్బంది లేదు. కంగనా ఎంతో టాలెంట్ కలిగిన నటి. ఆమెను కాపీ కొట్టానంటే సంతోషంగా స్వీకరిస్తా. ఒక వ్యక్తి ఎదుగుదలను, వ్యక్తిత్వాన్ని మాటలే నిర్ణయిస్తాయి.
నేనైతే నాలా స్వశక్తితో ఎలాంటి నేపథ్యం లేకుండా ఎదిగిన అమ్మాయిని ఈ విధంగా విమర్శించను. కంగనాను కాపీ కొడుతున్నాను అన్నందుకు బాధలేదు కానీ.. కంగనాకు ఇచ్చినంత పారితోషికం నాకు రావడంలేదు. ఆ విషయంలో మాత్రం కాస్త బాధగా ఉంది.’ అంటూ అందంగా నవ్వేసింది తాప్సీ.