Taapsee Pannu | బాలీవుడ్ నటి తాప్సీ పన్ను తన రాబోయే చిత్రం ‘గాంధారి’ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నలపై తీవ్రంగా స్పందించారు. తనపై కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు, గత వివాదాల గురించి మళ్లీ మళ్లీ మీడియా ప్రశ్నలు అడుగుతుండటంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు, మీడియా తమను ఈ వివాదం గురించి అడగడం ఆపివేస్తే ఈ సమస్య ఎప్పుడో ముగిసిపోయేదని, కానీ అందరికీ ఈ వివాదాలు చూసేందుకు ఆసక్తి ఉండటం వల్లే పదే పదే ఈ ప్రశ్నలు అడుగుతున్నారని తాప్సీ పేర్కొన్నారు. “మీరు ఈ విషయాన్ని ఎందుకు ముగియనివ్వరు? మా ఇద్దరిని ఈ ప్రశ్నలు అడగడం ఆపేస్తే ఈ సమస్య కూడా ముగిసిపోతుంది” అని ఆమె అక్కడి పాత్రికేయులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఇక ఈ వివాదానికి ప్రధాన కారణం తాప్సీ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో. తాను కంగనాను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదని, ఆమె గురించి తనకున్న అభిప్రాయం తన పెంపకాన్ని, ఆలోచనలను ప్రతిబింబిస్తుందని, అలాగే కంగనా ఆలోచనలు ఆమె పెంపకాన్ని సూచిస్తాయని తాప్సీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ తీవ్రంగా స్పందిస్తూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్టులు పెట్టారు. తాప్సీ తన సినిమా ప్రమోషన్ కోసం హెడ్లైన్స్లోకి వచ్చే ప్రయత్నం చేస్తోందని, ఆమె ఒక చీప్ కాపీ అని మండిపడ్డారు. అంతేకాకుండా, తాప్సీ తన తల్లిదండ్రుల పెంపకాన్ని ఎగతాళి చేస్తూ హద్దు మీరిందని, తన తల్లిదండ్రుల లాంటి ఒరిజినల్ మనిషిని తయారు చేయడంలో తాప్సీ తల్లిదండ్రులు విఫలమయ్యారని విమర్శిస్తూ ఆమె తల్లిదండ్రుల కష్టాన్ని ప్రశ్నించారు. అయితే ఆ తర్వాత కంగనా ఆ పోస్టులను డిలీట్ చేశారు.
ఈ ఇద్దరు నటీమణుల మధ్య వివాదం 2019లో కంగనా చిత్రం ‘జడ్జిమెంట్ హై క్యా’ ట్రైలర్‌ను తాప్సీ సోషల్ మీడియాలో ప్రశంసించినప్పటికీ, ఎక్కడా కంగనా పేరు ప్రస్తావించకపోవడంతో మొదలైంది. దీనిపై కంగనా సోదరి రంగోలీ చందేల్ తాప్సీని సస్తీ కాపీ అని సంబోధించారు. అప్పటినుంచి ఈ వివాదం మొదలైంది.
Taapsee Pannu reacted the Kangana Ranaut statement. https://t.co/XZvyhaAnSz pic.twitter.com/CyW3AYoQRk
— Ashish Singh (@AshishSinghKiJi) August 25, 2026