సోషల్‌మీడియాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ అభిమానులతో జరిపిన సరదా సంభాషణ ఓ ఇంట్రెస్టింగ్ సంఘటనతో ముగియడం విశేషం. ఇటీవల ట్విట్టర్లో అభిమానులతో ముచ్చటించారు షారుఖ్‌ఖాన్. వారు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ఓ అభిమాని ‘మీరు లంచ్ చేశారా బ్రదర్’ అని షారుఖ్‌ను అడిగాడు. ‘ఇంకా చేయలేదు.
మీరు స్విగ్గీ నుంచి మాట్లాడుతున్నారా? నాకోసం ఫుడ్ పంపిస్తారా? అంటూ షారుఖ్ సరదాగా రిైప్లె ఇచ్చారు. వీరిద్దరి సంభాషణను ఆన్లైన్లో వీక్షించిన ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ షారుఖ్‌ఖాన్ ఇంటికి ఏడుగురు డెలివరీ బాయ్స్‌తో భోజనాన్ని పంపించింది. అనంతరం ఆ ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం షారుఖ్‌ఖాన్ ‘జవాన్’ చిత్రంలో నటిస్తున్నారు.