Swayambhu | యువ హీరో నిఖిల్ సిద్ధార్థ కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న పీరియడ్ నేపథ్య చిత్రం ‘స్వయంభు.’ ఈ మూవీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ మరోసారి వాయిదా పడనుందని తెలుస్తుంది. ప్రారంభంలో ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయాలని భావించినప్పటికీ, తరువాత వేసవి కాలానికి మార్చారు. ఇప్పుడు మరోసారి విడుదల తేదీ మారే పరిస్థితి ఏర్పడింది.చిత్ర బృందం ఏప్రిల్ 30న రిలీజ్ చేయాలని పరిశీలించినప్పటికీ, సాంకేతిక పనులు ఇంకా పూర్తికాకపోవడంతో ఆ తేదీ సాధ్యం కాలేదని సమాచారం. ముఖ్యంగా చిత్రంకి సంబంధించిన భారీ వీఎఫ్ఎక్స్ పనులకి మరింత సమయం పడుతుందని తెలుస్తుంది.
పీరియాడిక్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రతి దృశ్యం అత్యున్నత స్థాయిలో ఉండేలా చిత్ర బృందం శ్రద్ధ తీసుకుంటోంది. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా, ప్రేక్షకులకు అద్భుత అనుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే విడుదలను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన విజువల్స్ కథలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే అవి పూర్తి స్థాయిలో మెరుగ్గా రావాలని హీరో నిఖిల్ సిద్ధార్థతో పాటు చిత్ర యూనిట్ పట్టుదలగా ఉంది. తొందరపడి విడుదల చేయడం కంటే, పూర్తి స్థాయి పనులు ముగిసిన తర్వాతే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని మే నెల చివరి వారంలో విడుదల చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విడుదల తేదీ ఖరారైన వెంటనే ప్రచార కార్యక్రమాలు కూడా భారీ స్థాయిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.