Gayatri Joshi | షారుఖ్ ఖాన్ స్వదేష్ (Swades) సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి గాయత్రి జోషి కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన ఇటలీలో జరుగగా.. గాయత్రితో పాటు ఆమె భర్త వికాస్ ఒబెరాయ్ కూడా ఈ ప్రమాదంలో గాయాలపాలయ్యాడు.
గాయత్రి ఆమె భర్త వికాస్ ఒబెరాయ్‌తో కలిసి ఇటలీ నుంచి వెళుతుండగా.. దురదృష్టవశాత్తు వారి కారు మంటల్లో చిక్కుకోని ప్రమాదం జరిగింది. గాయత్రి ప్రయాణిస్తున్న ఫెరారీ కారు మినీ ట్రక్కుతో సహా ఇతర వాహనాలను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇక ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ ఘటన తర్వాత గాయత్రి మీడియాతో మాట్లాడుతూ.. వికాస్, తాను ఇటలీలోనే ఉన్నామని, తాము ప్రమాదానికి గురయ్యాము. కానీ దేవుడి దయతో ఇద్దరం క్షేమంగా బయపడినట్లు ఆమె తెలిపింది.
Two deaths on a Ferrari in Sardina, Italy pic.twitter.com/skT3CaXg0T
— Globe Clips (@globeclip) October 3, 2023
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించిన గాయత్రి జోషి వీడియో జాకీగా తన కెరీర్‌ను ప్రారంభించింది. 2000లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్ గెలుచుకున్న తర్వాత ఆమె మిస్ ఇంటర్నేషనల్ 2000లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. 2004 చిత్రం స్వదేస్ సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. షారుఖ్ ఖాన్ లీడ్ రోల్లో నటించిన ఈ మూవీని అశుతోష్ గోవారికేర్ దర్శకత్వం వహించాడు.