రౌడీ బాయ్స్ ఫేం ఆశిష్ రెడ్డి (Ashish) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘సెల్ఫిష్’ (Selfish). కాశీ విశాల్ (Kasi Vishal) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సెల్ఫిష్ నేడు సెట్స్‌పైకి వెళ్లింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మీ ఆశీస్సులు కావాలని సుకుమార్ రైటింగ్స్ ట్వీట్ చేసింది. ఇప్పటికే ఆశిష్ స్లీవ్‌లెస్ బ్లాక్ షర్ట్‌లో స్టైలిష్ గాగుల్స్ పెట్టుకొని బైక్ రైడ్ చేస్తున్న స్టిల్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ (Mickey J Meyer) సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కో ప్రొడ్యూస్ చేస్తోంది. రౌడీబాయ్స్ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ రెడ్డికి ఇది రెండో సినిమా.
ఆశిష్ రెడ్డి స్టైలిష్ లుక్స్ తో అదరగొడుతూ.. ఎలాగైనా హిట్టు కొట్టాలని ఎదురుచూస్తున్నట్టు తాజా స్టిల్‌తో అర్థమవుతుంది. మరి ఈ సారి ఎలాంటి స్టోరీతో రాబోతున్నాడని రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది.
#Selfish, starring #Ashish goes on floors from today
Seeking your blessings 🙏🏽 #SelfishBegins@aryasukku @SVC_official #DilRaju #KasiVishal @SukumarWritings @Ashokbandreddi pic.twitter.com/I4qXu6VsdA
— Sukumar Writings (@SukumarWritings) December 5, 2022