జోశర్మ, సాంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎమ్4ఎమ్’ (మోటివ్ ఫర్ మర్డర్). స్వీయ నిర్మాణ దర్శకత్వంలో మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన ఈ సినిమా మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడటం గర్వంగా ఉందని, ఆద్యంతం ఉత్కంఠను పంచే కథ, కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందించామని, మర్డర్ మిస్టరీ థ్రిల్లర్గా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందని దర్శకనిర్మాత మోహన్ వడ్లపట్ల తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: మోహన్ మీడియా క్రియేషన్స్, నిర్మాణం, దర్శకత్వం: మోహన్ వడ్లపట్ల.