న్యూఢిల్లీ: మాజీ విశ్వసుందరి సుస్మతా సేన్(Sushmita Sen) ఓ సందర్భంలో డోనాల్డ్ ట్రంప్‌ను కలిసింది. ఆ ఘటనకు చెందిన విషయాన్ని ఇటీవల ఆ మాజీ విశ్వసుందరి వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మిస్ ఇండియా యూనివర్స్ ఫ్రాంచైజీకి విధులు నిర్వర్తిస్తున్న సమయంలో.. మిస్ యూనివర్స్ సంస్థ ఓనర్ డోనాల్డ్ ట్రంప్‌ను కలవాల్సి వచ్చినట్లు ఆమె చెప్పారు. 2010 నుంచి 2012 వరకు మిస్ ఇండియా యూనివర్స్ ఫ్రాంచైజీకి సుస్మితా వర్క్ చేసింది. ఇక అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఆ సంస్థకు ఓనర్‌గా ఉన్నారు.
ఓ దశలో మిస్ యూనివర్స్ పోటీలు నిర్వహించే సంస్థ తనను పిలిచిందని, ఫ్రాంచైజీ తీసుకుంటారా అని అడిగిందని, ఇది కలా నిజమా అన్న ఆలోచనల్లోకి వెళ్లినట్లు సుస్మితా గుర్తు చేశారు. అయితే మిస్ యూనివర్స్ సంస్థకు 1996 నుంచి 2015 వరకు డోనాల్డ్ ట్రంప్ ఓనర్‌గా ఉన్నారు. డోనాల్డ్ ట్రంప్‌కు చెందిన కంపెనీతో ఆసక్తికరమైన ఫ్రాంచైజీ కుదుర్చుకున్నట్లు సుస్మితా తెలిపింది. ఇదేమీ ఈజీగా చేసింది కాదన్నారు. కానీ తన వర్క్‌ను ట్రంప్ నేరుగా సమీక్షించలేదని ఆమె చెప్పింది. ఆ సమయంలో ప్యారామౌంట్ కమ్యూనికేషన్స్ అండ్ మాడిసన్ స్క్వేర్ గార్డెన్ తన పనిని సమీక్షించినట్లు చెప్పారు. ట్రంప్‌కు ఫ్రాంచైజీ ఓనర్‌గా చేసినట్లు ఆమె తెలిపింది.
ఫ్రాంచైజీ లింకు కారణంగా ట్రంప్‌ను కలిసే సందర్భంగా వచ్చినట్లు సుస్మితా చెప్పింది. అయితే ట్రంప్‌పై వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు మాజీ విశ్వసుందరి నిరాకరించింది. అది అవసరంలేని విషయమన్నారు. అధికారం ఉన్నా లేకున్నా.. కొందరు తమదైన ముద్ర వేసుకుంటారన్నారు. మిస్ యూనివర్స్ సంస్థకు ఓనర్‌గా ఉన్న సమయంలో ట్రంప్ ఓ ప్రముఖ వ్యాపారవేత్తగా వెలుగొందారు.
1994లో సుస్మితా సేన్ .. విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకున్నది. ఆ టైటిల్ సొంతం చేసుకున్న తొలి భారతీయురాలిగా నిలిచింది. ఆ తర్వాత కొన్నాళ్లూ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆమె రాణించింది. ఆర్యా, తాలీ లాంటి టీవీ సిరీస్‌ల్లోనూ నటించింది.