ఈశ్వర్, నయన్ సర్వర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సూర్యాపేట జంక్షన్’. ఎన్.రాజేష్ దర్శకుడు. అనిల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్.శ్రీనివాస రావు, విష్ణువర్థన్ నిర్మాతలు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర పనులను జరుపుకుంటున్నది.
దర్శకుడు మాట్లాడుతూ ‘ఓ సరికొత్త కథాంశంతో రూపొందుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. త్వరలోనే ఓ పాటను, ట్రైలర్‌ని విడుదల చేస్తున్నాం. త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రోషన్ సాలూరి, గౌర హరి.