Suriya – Dhoom 4 | కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దమైనట్లు తెలుస్తుంది. అయితే హీరోగా కాకుండా విలన్‌గా బాలీవుడ్లో అరంగేట్రం చేయబోతున్నాడు సూర్య. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ ధూమ్ సినిమాల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పటివరకు ఈ ఫ్రాంచైజీ నుంచి మూడు సినిమాలు రాగా మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ అందుకున్నాయి. ఇక ఈ సినిమాలల్లో హీరోల కంటే విలన్లకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుదన్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్‌లో జాన్ అబ్రహాం విలన్‌గా నటించగా.. ధూమ్ 2లో హృతిక్ రోషన్ విలన్‌గా నటించి మెప్పించాడు. ఒక థర్డ్ పార్ట్‌లో అయితే బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ నటించి రూ.500 కోట్లకు వసుళ్లను సాధించాడు. తాజాగా ఈ సినిమా పార్ట్ 4 రాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ పార్ట్‌లో విలన్‌గా సూర్య నటించబోతున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే అటు తమిళ ఫ్యాన్స్‌తో పాటు ఇటు తెలుగు ఫ్యాన్స్‌కు పండగా అనే చెప్పుకోవాలి.
యష్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో రాబోతున్న ఈ సినిమాకు కూడా ఫస్ట్ మూడు పార్ట్‌లకు కథను అందించిన ఆదిత్య చోప్రానే ‘ధూమ్ 4’కు కూడా కథను అందించబోతున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు సూర్య ఇప్పటికే 24 సినిమాతో పాటు ‘విక్రమ్’ చిత్రంలో నెగిటివ్ రోల్ చేసి అలరించాడు. విక్రమ్ సినిమాలో ఆయన చేసిన రోలెక్స్ పాత్రకు అయితే ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు అని చెప్పవచ్చు.
ALso Read..