Vidya Balan – MS Subbulakshmi | ప్రముఖ లెజెండరీ క్లాసికల్ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి (MS Subbalakshmi) బయోపిక్‌లో బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ చిత్ర పరిశ్రమ వర్గాలు. ఇప్పటికే దివంగత నటి సిల్క్ స్మితా బయోపిక్ డర్టీ పిక్చర్ (Dirty Picture) సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ అందుకున్న విద్యాబాలన్ మళ్లీ మరో బయోపిక్‌లో నటించబోతున్నట్లు తెలుస్తుంది.
నేడు లెజెండరీ క్లాసికల్ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి 108వ జయంతి. ఈ సందర్భంగా ఎంఎస్ సుబ్బలక్ష్మికి నివాళులు అర్పిస్తూ.. తనలాగే రెడీ అయ్యి విద్యాబాలన్ ఫొటోలు దిగింది. అచ్చం ఎంఎస్ సుబ్బలక్ష్మిలా ఉన్న విద్యా ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు విద్యాబాలన్ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ ఏమైనా ప్లాన్ చేస్తుందా అని కామెంట్లు పెడుతున్నారు. నా చిన్నప్పటి నుంచి ఉదయం నిద్ర లేవగానే నేను వినే మొదటి గొంతు సుబ్బులక్ష్మి గారిది. ఆమె ఓ ఆధ్యాత్మిక శక్తి. ఆమెకు ఇలా నివాళులర్పించడం చాలా ఆనందంగా, గౌరవంగా ఉంది అంటూ విద్యాబాలన్ రాసుకోచ్చారు.
#VidyaBalan and costume designer #AnuParathasarathy pay tribute to legendary singer #MSSubbulakshmi in “A Recreation of Iconic Styles” on her birthday. The project showcases Vidya recreating M.S. Subbulakshmi’s iconic looks, including her vibrant sarees and traditional… pic.twitter.com/zVu8768Uda
— Cineobserver (@cineobserver) September 16, 2024
Also Read..