కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి విమర్శించారు. ప్రతిపక్ష నేతల నోళ్లను మూసివేయించాలని లేదా.. పలాయనం చిత్తగించడం కాంగ్రెస్ తీరు అని అని అన్నారు.
అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం మధుసూదనాచారి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రయోజనాలే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేశారు. శాసనసభ, మండలి వేదికలుగా హామీలు నెరవేర్చేలా ప్రభుత్వాన్ని నిగ్గదీస్తామని తెలిపారు.