Ravi Teja | మాస్ మహరాజా రవితేజ (Ravi Teja) అభిమానులకు ఇది డబుల్ ధమాకా టైమ్. ఆయన నటించిన ‘మాస్ జాతర (Mass Jathara)’ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా, ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు.ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ వేడుక ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గెస్ట్‌గా రాబోతున్నారు. ఈ విషయాన్ని కొద్ది సేపటి క్రితం అఫీషియల్‌గా ప్రకటించారు. ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ వేడుక అక్టోబర్ 28న (మంగళవారం) హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా సూర్య రాబోతుండడం, రవితేజ-సూర్య ఒకే స్టేజ్‌పై కనిపించనుండడంతో ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. “మాస్ మీట్స్ క్లాస్” అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల చేయాలని ప్లాన్ ఉంది. అయితే ఒకరోజు ముందే (30న రాత్రి) ప్రీమియర్స్ వేసే అవకాశం కూడా పరిశీలిస్తున్నాం” అని తెలిపారు.ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘మాస్ జాతర’ రవితేజ కెరీర్లో 75వ చిత్రం, కాబట్టి సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.‘సామజవరగమన’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలకు రచయితగా పని చేసిన భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు.
చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించగా, సంగీతం భీమ్స్ సిసిరోలియో అందించారు. ‘ధమాకా’ తర్వాత రవితేజ–శ్రీలీల–భీమ్స్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన పాటలతో మాస్ ఫ్యాన్స్‌లో భారీ బజ్ క్రియేట్ చేసింది. ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుకకి సూర్య హాజరుకానున్నాడన్న వార్తతో రెండు ఇండస్ట్రీల ఫ్యాన్స్ కూడా ఉత్సాహంగా ఉన్నారు. రవితేజ ఎనర్జీకి, సూర్య క్లాస్ ప్రెజెన్స్ కలిస్తే ఈ ఈవెంట్ టాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్‌లోనూ వైరల్ కావడం ఖాయం.