RETRO | అభిమానులకు వినోదాన్ని అందించేందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya). ఈ స్టార్ యాక్టర్ కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraju) దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం రెట్రో ( Retro: Love Laughter War). సూర్య 44 (Suriya 44)గా వస్తోన్న ఈ మూవీ టైటిల్ టీజర్ అభిమానులు, మూవీ లవర్స్‌లో జోష్ నింపుతోంది.
తాజాగా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. యాక్షన్ మూడ్‌లో ఉన్న సూర్య ఆయుధం చేత బట్టిన లుక్‌తో ఈ సినిమాను మే 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. రజినీకాంత్ టైటిల్ రోల్ పోషిస్తున్న కూలీ మే 1న రావాల్సి ఉండగా.. రిలీజ్ వాయిదా పడనున్నట్టు ఇప్పటికే నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఇదే తేదీని సూర్య టీం ఎంపిక చేసుకుని సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది.
హీరోహీరోయిన్లు ఇద్దరూ ఓ ఆలయం మెట్లపై కూర్చుని ఉన్న సీన్లతో టైటిల్ టీజర్ లాంచ్ కాగా.. సూర్యకు తాయిత్తు కడుతుంది పూజాహెగ్డే. ఇది (తాయిత్తు)నా కోపాన్ని కంట్రోల్ చేస్తే.. నా తండ్రితో కలిసి పనిచేయడం ఆపేస్తా.. హింస, రౌడీయిజం లాంటి వాటిని ఈ క్షణం నుంచి వదిలిపెడతానంటున్నాడు సూర్య. ఇంతకీ సూర్య ఎమోషన్స్‌ను ఆ తాయిత్తు కంట్రోల్ చేస్తుందా.. ? అనేది సస్పెన్స్‌లో పెడుతూ కట్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
ఈ మూవీలో పాపులర్ మలయాళ నటుడు జోజు జార్జ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. సూర్య హోం బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్పై నిర్మిస్తున్న ఈ మూవీకి తిరు, 24, పేటా ఫేం సినిమాటోగ్రఫర్ డీవోపీగా వర్క్ చేస్తున్నాడు.
.#Retro from May 1st. pic.twitter.com/w0JiZ6hxGW
— Suriya Sivakumar (@Suriya_offl) January 8, 2025
RETRO టైటిల్ టీజర్..
Ramya | ఆ సన్నివేశాలు తొలగించండి.. కోర్టును ఆశ్రయించిన నటి రమ్య