Suriya 46 | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన 46వ చిత్రంతో టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు రానున్నారు. ప్రస్తుతం Suriya46 పేరుతో పలు భాషల్లో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా టాలీవుడ్లో సూర్యకి తొలి డైరెక్ట్ రిలీజ్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తాజా షెడ్యూల్ ఈస్ట్ యూరప్‌లోని బెలారస్లో జరుగుతోంది. అక్కడి అందమైన లొకేషన్లలో ఓ గ్రాండియర్ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు, ఓ మెలోడీ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను చాలా ప్రత్యేకంగా రూపొందిస్తున్నారని యూనిట్ వర్గాలు తెలిపాయి.
ఈ చిత్రంలో సూర్యకు జోడీగా మలయాళ నటి మమితా బైజు నటిస్తున్నారు. ఆమెకు ఇది తమిళంతో పాటు టాలీవుడ్లో తొలి సినిమా కావడంతో, ఈ మూవీ ద్వారా ఆమెకు పాన్-ఇండియా గుర్తింపు లభించే అవకాశముంది.అలాగే రవీనా టండన్, రాధికా శరత్ కుమార్, భవాని శ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఓ ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో అన్ని తరాల పాత్రలు కలగలిసిన చిత్రంగా ఇది రూపొందుతుంది. ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న జీవి ప్రకాశ్ కుమార్ ఇప్పటికే పలు హిట్ ఆల్బమ్‌లు అందించిన విషయం తెలిసిందే. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఆయన ఒకరు. సూర్య46 సినిమాకు కూడా ఆయన వైవిధ్యమైన సంగీతం అందిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు..
ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ మరియు సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ విలువల్లో ఏ మాత్రం తగ్గకుండా, సాంకేతికంగా అత్యంత హై స్టాండర్డ్స్‌తో సినిమా రూపొందుతోంది.ఇప్పటికే షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, త్వరలోనే టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఫ్యామిలీ, ఎమోషన్, యాక్షన్, మ్యూజిక్ కలగలిసిన ఈ చిత్రం, తెలుగు ప్రేక్షకులకు సూర్యను కొత్తగా పరిచయం చేయనుంది.